బాలిక హత్య కేసులో చోడవరం కోర్టు సంచలన తీర్పు..

చోడవరం (CLiC2NEWS): బాలిక హత్య కేసులో అనకాపల్లి జిల్లా చోడవరం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2015లో బాలికను అత్యంత దారుణంగా హత్య చేసినందుకు నిందితుడు శుభాచారి శేఖర్‌కు మరణ శిక్షను ఖారారు చేసింది. దేవరాపల్లికి చెందిన బాలికను నిందితుడు బీరు బాటిల్‌తో గొంతు కోసి చంపేశాడు. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. తాజాగా నేడు ఉరిశిక్షను విధిస్తూ చోడవరం 9వ అదనపు జిల్లా జడ్డి కె.రత్నకుమార్ తీర్పు వెలువరించారు. చోడవరం న్యాయస్థానం చరిత్రలో తొలిసారి ఉరిశిక్షను విధించింది.