విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు..

విశాఖ (CLiC2NEWS): అత్యాచార కేసులో ఓ ఉపాధ్యాయుడికి విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు 25 ఏళ్ల జైలు శిక్షను విధించింది. విశాఖ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 2020 లో మైనర్‌పై అత్యాచారానికి పాల్పడినందుకు గాను జైలు శిక్షతో పాటు , 50 వేల జరిమానాను విధించింది. బాధితురాలికి రూ. 4 లక్షల 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. కీచక ఉపాధ్యాయుడికి సరైన శిక్ష పడేలా వాదనలు వినిపించిన స్పెషల్ పోక్సో పిపి కి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.