నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై దృష్టి సారించాలి: సిఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ (CLiC2NEWS): ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిబంధనలు ఉల్లఘించే వ్యాపారులపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎవరైనా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని , రూతులను వేధిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రైతులను వేధిస్తే ఊరుకునేది లేదని.. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎస్మా కింద చర్యలు తీసుకోవానల్నారు. పంల కొనుగోళ్లలో మోసాలకు పాల్పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా జరిగేలా కలెక్టర్లు చూడాలన్నారు. ఇబ్బందులుంటే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సిఎం తెలిపారు.