ఐసియులో శ్రేయస్ అయ్యర్!
పక్కటెముకల వద్ద తీవ్ర గాయం..
హైదరాబాద్ (CLiC2NEWS): ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. బాల్ ను క్యాచ్ పట్టుకునేందుకు వెనక్కు పరుగుపెడుతూ గ్రౌండ్ కు బలంగా తాకాడు. ఈ ఘటనలో శ్రేయస్ ప్లీహానికి తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. తాజాగా అతన్ని ఐసియులో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి.
`శ్రేయస్ అయ్యర్ ప్లీహానికి గాయమైంది. అతడి పరిస్థితిపై వైద్య బృందం టెస్టులు చేయించింది. ఆ రిపోర్టుల్లో రక్తస్త్రావం జరిగినట్లు పరీక్షల్లో తేలింది. దీంతో అతన్ని ఐసియులో చేర్చాం. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉంది. తప్పకుండా అతడు కోలుకోని తిరిగి వస్తాడు“ అని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
Also Read:తుఫాన్ గా బలపడిన వాయుగుండం