ఛత్తీస్‌గఢ్‌లో ఏడుగురు జవాన్లు మృతి
రాయ్‌పుర్ (CLiC2NEWS): ఛత్తీస్‌గఢ్‌లో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టుల ఘాతుకానికి జవాన్లు మృత్యువాత పడ్డారు. రా లోని సుకుమా జిల్లాలో మందుపాతర పేలడంతో భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మావోయిస్టులు మందుపాతర పెట్టి జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని పేల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నట్లు తెలుస్తోంది.