TS: హైకోర్టులో ఏడుగురు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమితులైన ఏడుగురు న్యాయమూర్తులు శుక్రవారం ప్రమాణం చేశారు. హైకోర్టు ఫస్ట్ కోర్టు హాలు వేదికగా ఇవాళ (శుక్రవారం) ఉదయం 10.30 గంటలకు కొత్త న్యాయమూర్తుల చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ప్రమాణం చేయించారు.
ప్రమాణస్వీకరాం చేసిన ఏడుగురురు న్యాయమూర్తులు
- జస్టిస్ పెరుగు శ్రీ సుధా
- జస్టిస్ డాక్టర్ చిల్లకూరు సుమలత
- జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణి
- జస్టిస్ మున్నూరి లక్ష్మణ్
- జస్టిస్ ఎన్ తుకారాం జీ
- జస్టిస్ వెంకటేశ్వర్ రెడ్డి
- జస్టిస్ పటోళ్ల మాధవి దేవీ
ఒకేసారి ఏడుగురు న్యాయమూర్తులు ప్రమాణం చేయడం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. కాగా సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులుగా జ్యుడిషియల్ సర్వీసెస్ నుంచి ఏడుగురు పేర్లను సెప్టెంబరు 16న సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ చొరవ చూపి గత జూన్లో కోర్టు లోని న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కి పెంచేలా చర్యలు తీసుకున్నారు. ఇక్కడున్న ఖాళీల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త నియామకాలకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో నేడు కొత్తగా ఏడుగురు జడ్జిలు ప్రమాణ స్వీకారం చేశారు.