ఎపి హైకోర్టు జడ్జిలుగా ఏడుగురు న్యాయవాదులు.. సుప్రీం కొలీజియం సిఫార్సు

ఢిల్లి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు ఏడుగురు న్యాయవాదుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జనవరి 29న జరిగిన కొలీజియం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యాయవాదులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, చీలపాటి రవి, కొనకంటి శ్రీనివాస రెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, తర్లాడ రాజశేఖర్‌రావు, సత్తి సుబ్బారెడ్డి, వడ్డిబోయిన సుజాత పేర్లను ఉన్నత న్యామస్థానం కొలీజియం సిఫార్సు చేసింది. వీటితో పాటు ఒడిశా, మధ్యప్రదేశ్, మద్రాస్ హైకోర్టులకు న్యాయమూర్తులుగా పలువురి పేర్లను సుప్రీం కొలీజియం ప్రతిపాదించినట్లు సుప్రీంకోర్టు ప్రకటనలో పేర్కొంది.