దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. కారు అదుపుతప్పి ఏడుగురు మృతి

చెన్నై (CLiC2NEWS): ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు కారులో దైవ దర్శనానికి వెళ్లి.. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని తిరువణ్ణామల్ఐ సమీపంలో సంభవించింది. కర్ణాటకలోని తుముకూరుకు చెందిన మణికంఠన్ తన కుటుంబ సభ్యులతో కలిసి మేల్‌మలయనూరు అంకార పరమేశ్వరి ఆలయ దర్శనానికి వెళ్లురు. దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో వారి కారు తిరుమణ్ణామలై సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. కారులోని వారంతా అందులో ఇరుక్కుపోయారు. స్థానికులు వచ్చి కారులోని వారిని బయటకు తీయడం సాధ్యం కాలేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరకుని.. గునపాలతో కారును పగులగొట్టి మృతదేహాలను బయటకు తీశారు. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. కారు ప్రమాదం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల చొప్పున సాయం ప్రకటించారు.