ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి..

గాంధీనగర్ (CLiC2NEWS): గుజరాత్‌లోని సూరత్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సూరత్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో మనీవ్ సోలంకి కుటుంబం తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నారు. శనివారం కుంటుంబంలోని ఏడుగురు సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. మనీశ్ ఉరేసుకొని మృతి చెందగా.. తల్లిదండ్రులు, భార్య, ముగ్గురు పిల్లలు విషం తాగి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు ముందు రాసిన ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్డించారు.
ఫర్నీచర్ వ్యాపారం చేసే మనీశ్ సోలంకి తన కుటుంబంతో కలిసి సిద్దేశ్వర్ అపార్ట్‌మెంట్లో నివసిస్తున్నాడు. కొంతకాలం క్రితం అతను కొందరికి నగదును అప్పుగా ఇచ్చాడు. డబ్బును తిరిగి ఇవ్వాలని కోరగా.. వారు ఇచ్చేంఉదకు నిరాకరించినట్లు సమాచారం. డబ్బు వెనక్కి రాదేమోనని తీవ్రమనస్తాపానికి గురైన మనీశ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.