భారీ వ‌ర్షాల‌కు కొట్టుకుపోయిన కారు.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

చండీగ‌ఢ్‌ (CLiC2NEWS): ఉత్తార‌దిలో భారీ వ‌ర్షాలు కురుస్తున్న విష‌యం తెలిసిందే. ప‌లు ప్రాంతాల్లో వ‌ర‌ద నీరు అధికంగా రోడ్డు మార్గంలో ప్ర‌వ‌హిస్తుండ‌టంతో ఓ కారు కొట్టుకుపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న పంజాబ్‌లో చోటుచేసుకుంది. ఉత్త‌ర భార‌త్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ‌రాజ‌ధాని ఢిల్లీతో స‌హా రాజ‌స్థాన్‌, పంజాబ్‌, హిమాచ‌ల్ లోకూడా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇవాళ ఒక్క‌రోజులో 28 మంది చ‌నిపోయిన‌ట్లు సమాచారం.

హిమాచ‌ల్ ప్రదేశ్‌లోని మెహ‌త్‌పూర్ స‌మీపంలోని డెహ్రా నుండి పంజాబ్‌లోని ఎస్‌బిఎస్ న‌గ‌ర్‌లోని మెహ్రోవాల్ గ్రామంలో జ‌రిగే వివాహ వేడుక‌కు వెళ్తుండ‌గా ఓ కుంటుంబం ప్రాణాలు కోల్పోయింది. జైజోన్ అనే ప్రాంతంలో వాగు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుండ‌టంతో కారు కొట్టుకుపోయింది. ప్ర‌మాద స‌మ‌యంలో కారులో 10 మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది. స్థానికులు ఒక‌రిని కాపాడిన‌ట్లు స‌మాచారం. ఏడుగురు మృత‌దేహాల‌ను గుర్తించిన‌ట్లు పోలీసులు తెలిపారు. మ‌రో ఇద్ద‌రు కోసం గాలిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.