రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఏడుగురు మృతి..
హైదరాబాద్ (CLiC2NEWS): మేడ్చల్‌లోని కండ్లకోయ వద్ద దైవదర్శనానికి వెళ్లివస్తున్న వాహనం ప్రమాదానికి గురై.. ముగ్గురు మృతి చెందారు. శ్రీశైలం స్వామివారి దర్శనం ముగించుకొని తిరుగు ప్రయాణంలో టాటాఎస్ వాహనం ప్రమాదానికి గరైంది. ప్రమాద సమయంలో వాహనంలో 13 మంది ఉన్నారు. తీవ్రగాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు.
ఆదిలాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ నుండి వస్తున్న కారు గుడి హట్నూర్, సీతాగొంది సమీపంలో కంటైనర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు పురుషులు, ఒక మహిళ మృతి చెందారు. మరో మహిళకు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారగుటయే ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.