నదిలో కొట్టుకుపోయి ఏడుగురు మృతి.. అంతా 18 ఏళ్ల లోపు వారే..

చెన్నై (CLiC2NEWS): అంతా 18 ఏళ్ల లోపు వారే.. నదిలోకి స్నానం చేసేందుకు దిగి ఏడుగురు మృత్యువాత పడ్డారు. తమిళనాడు కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలోని కెడిలం నదిలోకి కొంతమంది యువతులు, బాలికలు ఆదివారం మధ్యాహ్నం స్నానం చేసేందుకు దిగారు. నీటి ప్రవాహం అధికం కావడంతో.. ఏడుగురు నీటిలో కొట్టుకు పోయారు. అక్కడ ఉన్నవారి కేకలు విని, కొంతమంది నదిలోకి దిగి వారిని బయటకు తీశారు. వెంటనే కడలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించడా.. అప్పటికే వారు మృతిచెందిచట్లు వైద్యులు తెలిపారు. మరణించిన వారు నవిత (18), ప్రియ (18), సుమత (18), మోనిష (16), సంఘవి(16), ఆర్.ప్రియదర్శిని(15), ఆమె సోదరి దివ్యదర్శిని(10)గా గుర్తించారు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.