మంత్రి కెటిఆర్‌ను కలిసిన పలువురు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు..
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రగతిభవన్‌లో టిఆర్ ఎస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్‌తో పలు జిల్లాల టిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సమావేశమయ్యారు. నిజామాబాద్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, కామారెడ్డి నుండి ముజీబుద్ధీన్ , రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ ఎస్ అధ్యక్షడు తోట ఆగయ్య కెటిఆర్‌తో భేటీ అయ్యారు. ఈనెల 26 వ తేదీన టిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన విషయం తెలిసినదే.
టిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులైన సందర్భంగా వారందరికీ మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మీ నాయకత్వంలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకొని పార్టీని మరింత బలోపేతం చేయాలని వారికి సూచించారు.