షేక్.బహర్ అలీ: ప్రాణముద్ర

ప్రాణముద్ర చేయువిధానం
నిదానం నేల మీద కూర్చొని వజ్రాసనం లేదా సుఖాసనం లేదా పద్మాసనం లేదా సిద్ధాసనం లో ఎదో ఒక అసనములో కూర్చొని ప్రాణముద్రను ఈ విధంగా వేయాలి. చిటికెన, అనామిక మరియు బొటన వ్రేళ్ళ చివర భాగములను పరస్పరం కలపటం వలన ఏర్పడును. మిగిలిన రెండు వ్రేళ్ళను చక్కగా ఉంచవలెను.
ప్రయోజనాలు..
ఈ ముద్ర వలన ప్రాణము యొక్క సుప్త (నిద్ర) శక్తి జాగరణనొందగలదు. శరీరంలో స్ఫూర్తి, ఆరోగ్యం, మరియు urjam వికాసం నొందును. ఈ ముద్ర కన్నుల దోషములను దూరమోనర్చి జ్యోతులను వికాశపరుచును. శారీరక రోగముల నిరోధకశక్తి వృద్దియగును. విటమిన్లు లోటు తీర్చును. అలసట కూడా తొలిగించును. నూతన శక్తిని సంచారమోనర్పచేయును. దీర్ఘకాల ఉపవాసముల సమయమున ఆకలిదప్పుల భాద ఉండదు. నిద్ర రానప్పుడు దీనిని జ్ఞానముద్రతో చేయటం వలన చాలా ప్రయోజనం గా ఉండును. యోగాచార్యుడు.
-షేక్.బహర్ అలీ
యోగచార్యుడు