న్యూఇయ‌ర్ బ‌హుమ‌తిగా షేక్‌పేట ఫ్లై ఓవ‌ర్ ప్రారంభం

హైద‌రాబాద్ (CLiC2NEWS): హైద‌రాబాద్ న‌గ‌రం వేగంగా అభివృద్ధి చెందుతున్న‌దని ఐటి మంత్రి కెటిఆర్ అన్నారు. రీజ‌న‌ల్ రింగ్ రోడ్డు (RRR) పూర్త‌యితే హైద‌రాబాద్తో ఏ న‌గ‌రం కూడా పోటీ ప‌డ‌లేద‌న్నారు. కొత్త సంవ‌త్స‌రం బ‌హుమ‌తిగా షేక్‌పేట పై వంతెన‌ను కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డితో క‌లిసి రాష్ట్ర పుర‌పాల‌క మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. ఎస్ ఆర్ డిపి కార్య‌క్ర‌మం కింద పెద్ద ఎత్తున ర‌హ‌దారుల నిర్మాణం చేప‌ట్టామని తెలిపారు. రీజ‌న‌ల్ రింగ్ రోడ్డు కూడా త్వ‌ర‌గా పూర్త‌య్యేలా చూస్తామ‌ని వెల్ల‌డించారు. కంటోన్మెంట్‌లో మూసివేసిన ర‌హ‌దారుల‌ను తెరిపించాల‌ని ఈ సంద‌ర్భంగా కెటిఆర్‌.. కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డిని కోరారు. దాదాపు కంటోన్మెంట్‌లో 21 రోడ్ల‌ను మూసివేశార‌ని.. వాటిని తెరిపించేలా కృషి చేయాల‌ని కోరారు. అలాగే న‌గ‌రంల్ చార్మినార్‌, గోల్కొండ స‌హా ఎన్నో చారిత్ర‌క క‌ట్ట‌డాలు ఉన్నాయ‌ని.. హెరిటీజ్ సిటీగా హైద‌రాబాద్ను గుర్తించేలా కృషిచేయాల‌న్నారు.

  • వంతెన వ్య‌యం: రూ. 333.55 కోట్లు
  • పొడ‌వు: 2.8 కిలో మీట‌ర్లు
  • వెడ‌ల్పు: 24 మీట‌ర్లు (ఆరు లైన్లు)
  • పిల్ల‌ర్లు : 74
Leave A Reply

Your email address will not be published.