కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల
![](https://clic2news.com/wp-content/uploads/2024/01/sharmila-joined-congress.jpg)
న్యూఢిల్లీ (CLiC2NEWS): వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయంలో గురువారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఖర్గే పార్టీ కండువా కప్పి షర్మిలను పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో వైఎస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్లయింది.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ. ఇవాళ్టి నుండి వైఎస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఒక భాగమని తెలిపారు. వైఎస్సార్ తన జీవితమంతా కాంగ్రెస్ పార్టీకోసమే పనిచేశారని గుర్తు చేశారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తానని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాని గా చూడడం మా నాన్న కల అని.. దానిని నెరవేర్చడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.