మహిళల పేరుమీద ఇంటింటికి రూ. 5,000: షర్మిల

అనంతపురం (CLiC2NEWS): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఇందిరమ్మ అభయం కింద ఇంటింటికి మహిళల పేరు మీద రూ. 5 వేల ఆర్ధిక సాయం అందజేస్తామని షర్మిల ప్రకటించారు. అనంతపురంలో నిర్వహించిన ‘కాంగ్రెస్ న్యాయ సాధన సభ’లో కాంగ్రెస్ ఎపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. నవ్యాంధ్రను నిర్మిస్తామన్న జగన్ ప్రత్యేక హోదాను విస్మరించారన్నారు. హోదా కోసం గతంలో జగనన్న దీక్షలు చేశారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తే హోదా ఎందుకు రాదని ప్రశ్నించారని.. అదినమ్మి జగన్‌ను ప్రజలు గెలిపించారన్నారు. సిఎం అయ్యాక ఆయన ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేశారా.. అధికారంలోకి వచ్చాక రాజీనామాలు చేశారా.. అని ప్రశ్నించారు. జగన్ తన పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని.. మద్యపానం నేషేధం చేస్తానని చెప్పి, నాసిరకం మద్యం ప్రభుత్వం ద్వారానే అమ్ముతున్నారన్నారని విమర్శించారు.