15 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠం ఆప్‌దే..
![](https://clic2news.com/wp-content/uploads/2023/02/SHELLA-OBEROI.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీ మేయర్‌గా ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ ఎన్నికయ్యారు. మొత్తం 266 ఓట్లు పోల్ అవ్వగా షెల్లీ ఒబెరాయ్‌కు 150 ఓట్లు.. బిజెపి అభ్యర్థి రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి. ఆప్ పార్టీ అభ్యర్థి విజయం సాధించిన సందర్బంగా సిఎం అర్వింద్ కేజ్రీవాల్, డిప్యూటి సిఎం మనీశ్ సిసోడియా అభినందనలు తెలిపారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆప్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ ఎన్నిక ప్రక్రియ మూడు సార్లు వాయిదా పడటంతో ఆప్ అభ్యర్థి అయిన షెల్లీ ఒబెరాయ్.. ఈ ఎన్నిక జరగకుండా బిజెపి అడ్డుకుంటోందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం జోక్యంతో ఈ ఎన్నిక ప్రక్రియ బుధవారం నిర్వహించారు. ఆప్ పార్టీ విజయం సాధించింది. దీంతో 15 ఏళ్ల తర్వాత మొదటి సారి బిజెపి నుండి మేయర్ పీఠం ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ చేజిక్కించుకున్నారు.