బల పరీక్షలో నెగ్గిన షిండే
ముంబయి (CLiC2NEWS): మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకున్నారు. సోమవారం నిర్వహించిన విశ్వాస పరీక్షలో మెజార్టీ సంఖ్య (144)ను దాటి 164 మంది ఎమ్మెల్యేలు షిండేకు మద్దతుగా ఓటు వేశారు. ఆ వెంటనే బలపరీక్షలో ముఖ్యమంత్రి నెగ్గినట్లు స్పీకర్ రాహుల్ సర్వేకర్ ప్రకటించారు. సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే డివిజన్ ఆఫ్ ఓటింగ్ పద్ధతిలో ఓటింగ్ చేపట్టాలని ప్రతిక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దానికి స్పీకర్ అంగీకరించారు. దాంతో షిండేకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు లేచి నిలబడగా.. అసెంబ్లీ సిబ్బంది లెక్కింపు చేశారు. షిండేకు మద్దతుగా మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. 99 మంది వ్యతిరేకంగా ఓటెయ్యగా ముగ్గురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.