శివాజి విగ్రహం కూలిన ఘటన.. క్షమాపణలు తెలిపిన ప్రధాని మోడీ

ముంబయి (CLiC2NEWS): ఛత్రపతి శివాజి భారీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజి భారీ విగ్రహం కొద్ది రోజుల క్రితం కూలిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని పాల్ఘర్‌లో పర్యటించిన ప్రధాని .. విగ్రహం కూలడంపై శివాజీకి క్షమాపణలు తెలియజేస్తున్నాను.. ఛత్రపతి శివాజి మహారాజ్‌ను తమ దైవంగా భావించే వారు ఈఘటనతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నా తలవంచి వారికి క్షమాపణలు చెబుతున్నానన్నారు. మనకు ఈ దైవం కంటే గొప్పది ఏమీ లేదన్నారు.
అవసరమైతే క్షమాపణలు చెప్పేందుకు సిద్దమన్న మాహారాష్ట్ర సిఎం