Shocking Video: కొవిడ్ పేషెంట్ మృత‌దేహాన్ని న‌దిలో ప‌డేశారు..!

ధ్రువీక‌రించిన అధికారులు.. కేసు న‌మోదు

బ‌ల్‌రామ్‌పూర్ (CLiC2NEWS): యుపిలో ఈ మ‌ధ్య‌కాలంలో న‌దుల్లో  మృత‌దేహాలు కొట్టుకు రావ‌డం క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఆ మృత‌దేహాల‌న్నీ కొవిడ్ బాధిత మృత‌దేహాలేనా అని అనుమానిస్తున్న స‌మ‌యంలో ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో ఓ షాకింగ్ వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న వీడియోలో.. ఓ వ్య‌క్తి పీపీఈ కిట్ వేసుకొని కొవిడ్‌తో చ‌నిపోయిన వ్య‌క్తి మృత‌దేహాన్ని బ్రిడ్జిపై నుంచి న‌దిలోకి విసిరి వేస్తున్న ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. అది ఇప్పుడు వైర‌ల్‌గా మారిపోయింది. దాంతో అప్ర‌మత్త‌మైన అధికారులు ద‌ర్యాప్తున‌కు ఆదేశించారు.

యుపిలోని బ‌ల‌రాంపూర్ జిల్లాలోని ర‌ప్తి న‌దిపై ఉన్న ఓ బ్రిడ్జి వ‌ద్ద ఇద్ద‌రు వ్య‌క్తు ఓ మృత దేహంతో క‌నిపించారు. పిపిఇ కిట్ వేసుకున్న ఓ వ్య‌క్తితో పాటు మ‌రో వ్య‌క్తి ఆ మృత‌దేహాన్ని న‌దిలోకి జార‌విడుస్తున్న‌ట్లు ఆ వీడియోలో క‌నిపించింది. అదే స‌మ‌యంలో కారులో వెళ్లున్న వ్య‌క్తులు ఆ వీడియోని షూట్ చేశారు. ఈ విష‌యం అధికారుల దృష్టికి వెళ్ల‌డంతో ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

దీంతో జిల్లా వైద్యాధికారులు అది కొవిడ్ ఆ మృత‌దేహం కొవిడ్‌తో మ‌ర‌ణించిన వ్య‌క్తిదే అని ధ్రువీక‌రించారు. కాగా బంధువుల‌పై అధికారులు కేసు న‌మోదు చేశారు. కాగా కొవిడ్ సోకిన వ్య‌క్తి మే 25వ తేదీన ఆసుప‌త్రిలో చేరారు. 3 రోజుల చికిత్స అనంత‌రం ప్రాణాలు కోల్పోయాడు. అనంత‌రం కొవిడ్ నిబంధ‌న‌ల ప్ర‌కారం వైద్యులు మృత‌దేహాన్ని బంధువుల‌కు అప్ప‌గించారు… కాగా బంధువులు ఆ మృత‌దేహాన్ని న‌దిలో విడిచిపెట్ట‌నట్లు అధికారులు ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చారని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు బ‌ల‌రాంపూ చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ బీబీ సింగ్ తెలిపారు. వాళ్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.