జపాన్ మాజీ ప్రధానిపై కాల్పులు?
టోక్యో (CLiC2NEWS): జపాన్ మాజీ ప్రధాని షింజో అబే శుక్రవారం టోక్యోలో లిబరల్ డెమొక్రిటిక్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్న ఆయన ఉన్నట్టుంది కింద పడిపోయారు. ఆ సమయంలో అక్కడ తుపాకీ శబ్దం వినిపించినట్లు అక్కడే ఉన్న స్థానక విలేకరులు తెలిపారు. బహుషా గుర్తు తెలియని దుండగుడు షింటోజై కాల్పులు జరిపి ఉంటారని అనుమానిస్తున్నారు. కాల్పుల్లో షింజో తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. రక్తం కారుతూ ఉన్న ఆయనను ఘటన జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనలో పోలీసులు ఓ అనుమానితుణ్ణి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా గాయపడిన షింజో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని జపాన్ బ్రాడ్‌కాస్టర్ ఎన్ హెచ్‌కె పేర్కొంది. ఆయనను వెన నుంచి కాల్పినట్లు భావిస్తున్నారు.