శ్రీరాం సాగర్ 22 గేట్లు ఎత్తి నీటి విడుదల

నిజామాబాద్ (CLiC2NEWS): ఎగువన విస్తారంగా కురుస్తున్న వర్షాలతో నిజమాబాద్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 22 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1088 గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం ప్రాజెక్టులోకి 90,190 క్యూసెక్కులుగా ఉండగా.. అవుట్ ఫ్లో 95,952 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90.3 టిఎంసిలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 76.424 టిఎంసిలుగా ఉంది.