భూమిపై దిగిన శుభాంశు
న్యూఢిల్లీ (CLiC2NEWS): భారత్ వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం సురక్షింతంగా భూమికి చేరింది. ఈ బృందం మంగళవారం మధ్యాహ్నం 3.01కి కాలిఫోర్నియా సముద్ర తీరంలో విజయవంతంగా చేరింది. దీంతో యాక్సియం 4 మినషన్ విజయవంతమైనట్లు కమాండర్ పెగ్గీ విట్సన్ పేర్కొన్నారు. శుభాంశు సురక్షితంగా తిరిగి రావడంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, మిత్రులు సంతోషం వ్యక్తం చేశారు. దీంతో లఖ్‌నపూలో వారు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.
దీనిపై ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా స్పందించారు..
“చరిత్ర సృష్టించి భూమికి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశుకు స్వాగతం… పట్టుదల, అంకితభావం, ధైర్యం ద్వారా శుభాంషు కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తిగా నిలిచారు“ అని మోడీ ఎక్స్ వేదికగా తెలిపారు.
Group Captain #ShubhanshuShukla has returned to Earth!
From the International Space Station to a roaring Dragon splashdown –#Axiom4 | #Ax4 | #AxiomMission4 made history.
India’s son kissed the stars and came back home.
Salute the sky warrior! 🚀🇮🇳 pic.twitter.com/FavU858fmM— Adorable (@rehnedotum_) July 15, 2025