14 పరుగుల తేడాతో రోహిత్ సేన విజయం
![](https://clic2news.com/wp-content/uploads/2023/04/HYD-VS-MUMBAI-1.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19.5 ఓవర్లకు 177 పరుగులు చేసి ఆలౌటయింది. దీంతో ముంబయి ఇండియన్స్ 14 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది. టాస్ ఓడి ముంబయి ఇండియన్స్ తొలత బ్యాంటింగ్ చేసింది. రోహిత్ సేన నిర్ణీత 20వ ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
సన్ రైజర్స్ బ్లాటర్లలో మయాంక్ అగర్వాల్ 48, హెన్రిచ్ క్లాసెన్ 36, మార్‌క్రమ్ 22 పరుగులు చేయగా.. మిగిలిన వారు పెద్దగా పరుగులు చేయలేదు. ముంబయి బౌలర్లు పీయూష్ చావ్లా, బెహ్రన్డార్ఫ్, రిలె మెరిడిత్ తలో రెండు వికెట్లు తీశారు. అర్జున్ టెండూల్కర్, కామెరూన్ చెరో ఒక వికెట్ పడగొట్టారు.