ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల తేదీలు ఖరారు
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఎస్ ఐ, కానిస్టేబుల్ పరీక్షల తేదీలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. సివిల్, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్, ఫింగర్ ఫ్రింట్ పోస్టులకు వేర్వేరుగా తేదీలను బోర్డు వెల్లడించింది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 23 వరకు పరీక్షలను నిర్వహించేదుకు టిఎస్ ఎల్ పిఆర్‌బి ఏర్పాటు చేసింది.
ఏప్రిల్ 8న సివిల్, ఐటీ, ట్రాన్స్‌ఫోర్ట్ ఎస్సై, ఫింగర్‌ఫ్రింట్ కు సంబంధించిన ఎఎస్సై అభ్యర్థులకు ఫస్ట్ పేపర్లు నిర్వహించనున్నరు.
ఉ.10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు అర్థమేటిక్, రీజనింగ్.
మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఇంగ్లిష్ పరీక్ష జరుగనుంది.
ఏప్రిల్ 9న ఉదయం సివిల్ ఎస్సై అభ్యర్థులకు మూడో పేపర్.. జనరల్ స్టడీస్ మధ్యాహ్నం తెలుగు / ఉర్దూ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ ఎస్సై తుది పరీక్షలకు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
సివిల్, ట్రాన్స్‌ఫోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏప్రిల్ 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జనరల్ స్టడీస్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
మళ్లీ అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఐటి అండ్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అభ్యర్తులకు టిక్నికల్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
మార్చి 12న ఉదయం. ఐటి అండ్ కమ్యూనికేషన్ ఎస్సై అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష,
మధ్యాహ్నం ఫింగర్ ప్రింట్ ఎఎస్సై అభ్యర్తులకు టెక్నికల్ పరీక్ష జరుగనుంది.
మార్చి 26న ఉదయం ట్రాన్స్‌ఫోర్టు ఎస్సై టెక్నికల్ పరీక్ష,
ఏప్రిల్ 2న ఉదయం కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు టెక్నికల్ పరీక్ష నిర్వహించనున్నారు.
అదే రోజున మధ్యాహ్నం కానిస్టేబుల్, మెకానిక్ అభ్యర్థులకు టెక్నికల్ పరీక్ష జరుగనుంది. ఈ పరీక్షలను హైదరాబాద్‌లో నే నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది.