ఎసిబి వలలో పరిగి ఎస్సై

ప‌రిగి (CLiC2NEWS):
వికారాబాద్ జిల్లాలోని పరిగిలో ఏసీబీ దాడులు చేశారు. ఏసీబీ వలకు పరిగి ఎస్సై క్రాంతికుమార్ పట్టుబడ్డారు. ఎస్టీ అట్రాసిటీ కేసులో పది వేలు లంచం తీసుకుంటుండ‌గా ఏసిబి అధికారులు ప‌ట్టుకున్నారు. . ఓ కెసు విషయంలో 15 వేలు డిమాండ్ చేయగా 10వేలు ఇస్తుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు.
ఈ ఘ‌ట‌న గురువారం సాయంత్రం 7 గంట‌ల ప్రాంతంలో పట్ట‌ణ కేంద్రంలో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మీడియాకు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

సయ్యద్ పల్లి గ్రామానికి చెందిన మాసని సురేష్, భూమన్న గారి సాయిరెడ్డి మ‌ధ్య భూమి విషయంలో గొడవపడ్డారు. ఇటీవ‌ల ఇద్ద‌రూ రాజీ ప‌డ్డారు. కేసు కూడా న‌మోదు చేయ‌ని ఎస్ ఐ రూ. 10 వేలు సాయిరెడ్డి త‌ర‌ఫున ఇవ్వాల‌ని అత‌ని చిన్నాన్న మండ‌ల కాంగ్రెస్ అధ్య‌క్షుడు ప‌ర‌శురాంరెడ్డిని డిమాండ్ చేశారు. త‌న‌ను వ‌చ్చి క‌ల‌వాల్సిందేన‌ని పేర్కొనడంతో డ‌బ్బులు ఇచ్చేందుకు అంగీక‌రించిన ఆయ‌న ఎసిబి అధికారుల‌ను ఆశ్ర‌యించారు.

స్థానికంగా ఉన్న ఒక హోట‌ల్‌లో అనుకున్న మేర‌కు రూ. 10 వేల‌ను ఎస్సై క్రాంతికుమార్ తీసుకుంటుండ‌గా ఎసిబి అధికారులు రెడ్ హాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. ఈ మేర‌కు పట్టుబడిన ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శుక్ర‌వారం (నేడు ) రిమాండ్ కు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.. ఈ ఘ‌ట‌న ప‌రిగి ప‌ట్ట‌ణంలో క‌ల‌క‌లం రేపుతోంది.

Leave A Reply

Your email address will not be published.