భార్య, పిల్ల‌ల‌ను చంపి.. క‌లెక్ట‌ర్ గ‌న్‌మెన్ ఆత్మ‌హ‌త్య‌!

సిద్దిపేట (CLiC2NEWS): జిల్లాలోని రామునిపట్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భార్య, ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపి.. క‌లెక్ట‌ర్ గ‌న్‌మెన్ న‌రేశ్‌ తుపాకీతో కాల్చుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.  జిల్ల‌లోని చిన్న‌కోడూర్ మండ‌లం రామునిప‌ట్ల గ్రామంలో నరేశ్ కుంటుంబంతో నివాసం ఉంటున్నాడు. న‌రేశ్.. జిల్లా కెల‌క్ట‌ర్ ప్ర‌శాంత్ జీవ‌న్ పాటిల్ వ‌ద్ద గ‌న్‌మెన్‌గా విధులు నిర్వ‌హించేవాడు. ఆయ‌న‌కు భార్య చైతన్య‌, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శుక్ర‌వారం విధుల‌కు వెళ్ల‌కుండా ఇంటివ‌ద్ద‌నే ఉన్న న‌రేశ్ ఈ బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్ప‌డ్డాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్నారు. న‌రేశ్ ఆత్మహ‌త్య‌కు గ‌ల కార‌ణాలు గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.