ఈ నెల 7 నుండి 13 వరకు సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రద్దు..

విశాఖ (CLiC2NEWS): విజయవాడ డివిజన్‌లో భద్రాతా పరమైన అధునికీకరణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు వాల్తేరు సనీయిర్ డిసిఎం ఎ.కె. త్రిపాఠి వివరించారు. నవంబర్ 6 నుండి 12 వరకు గుంటూరు-విశాఖ (17239) సింహాద్రి ఎక్స్ ప్రెస్, రాజమహేంద్రవరం- విశాఖ (07466) మెమూ, విశాఖ-రాజమహేంద్రవరం (07467) మెమూ.. అదేవిధంగా ఈ నెల 7 నుండి 13 వరకు విశాఖ-గుంటూరు (17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్ సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటనలో తెలిపారు.