PV Sindhu: ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధు

టోక్యో(CLiC2NEWS): ఒలింపిక్స్‌లో బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు చ‌రిత్ర సృష్టించింది. ఆదివారం చైనాకు చెందిన హి బింగ్జియావోతో జ‌రిగిన మ్యాచ్‌లో సింధు 21-13, 21-15 తేడాతో వ‌రుస గేమ్స్‌లో విజ‌యం సాధించింది. దీంతో టోక్సో ఒలింపిక్స్‌లో భార‌త్‌కు రెండో పత‌కం అందించింది. 2016 రియో ఒలింపిక్స్‌లోనూ సింధు సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన విష‌యం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియాకు ఇది రెండో మెడ‌ల్‌. తొలి మెడ‌ల్‌ను వెయిట్‌లిఫ్ట‌ర్ మీరాబాయి చాను అందించిన విష‌యం తెలిసిందే. ఇక బాక్స‌ర్ లవ్లీనా ఇప్ప‌టికే మ‌రో మెడ‌ల్‌ను కూడా ఖాయం చేసింది.

ఈ మ్యాచ్‌లో సింధు ఆది నుంచి పూర్తి ఆధిప‌త్యం చెలాయించింది. తొలి గేమ్‌లో విరామ స‌మ‌యానికి 11-8 తో న‌లిచిన సింధు త‌ర్వాత మ‌రింత దూకుడుగా ప్ర‌త్య‌ర్థిని క‌ట్ట‌డి చేసింది. ఈ క్ర‌మంలో తొలిగేమ్‌ను 21-13తో కైవ‌సం చేసుకుంది. రెండో గేమ్లో కూడా సింధూ దూకుడు ప్ర‌ద‌ర్శించింది. విరామ స‌మ‌యానికి మ‌ళ్లీ 11-8తో నిలిచింది. ఈ క్ర‌మంలో చివ‌రి వ‌ర‌కూ ఉత్కంఠ‌గా సాగిన పోరులో సింధూ 21-15 తో విజ‌యం సాధించింది.

Leave A Reply

Your email address will not be published.