అశ్రున‌య‌నాల మ‌ధ్య ముగిసిన సిరివెన్నెల అంత్య‌క్రియ‌లు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప్ర‌ముఖ గేయ‌ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి అంత్య‌క్ర‌య‌లు ముగిశాయి. హైదరాబాద్​లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం నిర్వహించారు. సిరివెన్నెల చితికి ఆయ‌న పెద్ద కుమారుడు సాయి వెంక‌ట యోగేశ్వ‌ర‌శ‌ర్మ నిప్పంటించారు. ఈ ఉద‌యం సిరివెన్నె భౌతిక కాయాన్ని ఆయ‌న నివాసం నుంచి ఫిలింఛాంబ‌ర్‌కు తీసుకొచ్చారు. అక్క‌డ సిరివెన్నెల పార్థీవ దేహానికి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు నివాళుల‌ర్పించారు. అనంత‌రం సిరివెన్నెల అంతిమ‌యాత్ర కు టాలీవుడ్​ ప్రముఖులందరూ కన్నీటి వీడ్కోలు పలికారు.

ఇవాళ ఉదయం ఫిల్మ్​ ఛాంబర్​లో ఆయన భౌతికకాయం.. అభిమానుల సందర్శనార్థం ఉంచారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున సహా సినీ ప్రముఖులందరూ సిరివెన్నెలను కడసారి చూసేందుకు అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో తమకున్న అనుబంధాన్ని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు.

Leave A Reply

Your email address will not be published.