సీతారామ్ ఏచూరి ఇక లేదు

హైద‌రాబాద్ (CLiC2NEWS): సిపిఎం ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి (72) క‌న్నుమూశారు. అనారోగ్య కార‌ణాల‌తో ఢిల్లీ లోని ఎయిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. 1992 నుంచి పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా, 2005 నుంచి 2017 వ‌ర‌కు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా సీతారామ్ కొన‌సాగారు. ఆగ‌స్టు 12వ తేదీ 1952వ సంవ‌త్స‌రంలో మ‌ద్రాస్‌లో సీతారాం ఏచూరి జ‌న్మించారు. ఆయ‌న తండ్రి స‌ర్వేశ్వ‌ర సోమ‌యాజుల ఏచూరి ఎపి స్టేట్ రోడ్ కార్పొరేష‌న్ లో ఇంజినీర్, త‌ల్లి క‌ల్ప‌కం ఏచూరి ప్ర‌భుత్వ ఉద్యోగి. సీతారామ్ బాల్యం హైద‌రాబాద్‌లోనే గ‌డిచింది.

1974లో సితారాం ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి నేత‌గా ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లైంది. ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో అరెస్ట‌యిన వారిలో సీతారాం కూడా ఒక‌రు. 1984లో సిపిఎం కేంద్ర క‌మిటీలో చేరారు. 1992లో పార్టీ పొలిట్ బ్యూరో స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు. 2005లో వెస్ట్ బెంగాల్ నుంచి తొలిసారి రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై గ‌ళం విప్పుతూ సీతారం ఏచూరి గుర్తింపు పొందారు.

Leave A Reply

Your email address will not be published.