ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు ప్రారంభం: మంత్రి ఉత్తమ్ కుమార్
హైదరాబాద్ (CLiC2NEWS): ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టును సిఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఆయన బుధవారం సమీక్షించారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా , ఇఎన్సిలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్వాతంత్య్ర దినోత్సం రోజున ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీనికి ముందు వైరాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.