1200 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయిన ఆరుగురు చిన్నారులు..

ఇస్లామాబాద్ (CLiC2NEWS): ఆరుగురు చిన్నారులు స‌హా ఎనిమిది మంది 1200 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయారు. పాకిస్థాన్‌లోని ఖైబ‌ర్ ప‌ఖ్తుంఖ్ఆ రాష్ట్రంలో లోయ‌ల‌ను దాటేందుకు కేబుల్ కారును వినియోగించేవారు. పాఠ‌శాల‌కు వెళ్లే ఆరుగురు చిన్నారులు మంగ‌ళ‌వారం లోయ‌ను దాటేందుకు వినియోగించిన కేబుల్ కారు ప్రారంభించిన కాసేప‌టికే విరిగిపోయింది. దీంతో 1200 అడుగుల ఎత్తులో కారు ఆగిపోయింది. దానిలో ఉన్న ఒక వ్య‌క్తి ఫోను ద్వారా స‌మాచారం మీడియాకు వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం. ఉద‌యం ఏడు గంట‌ల నుండి ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి స‌హాయం అంద‌లేదు. వారి స‌మీపంలో ఒక హెలికాప్ట‌ర్ తిరిగింద‌ని.. అయినా వారికి ఎలాంటి స‌హాయం అంద‌లేద‌ని స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.