AP: రత్నగిరి చెరువులో ఆరుగురు గల్లంతు.. మృతదేహాలు లభ్యం
నెల్లూరు (CLiC2NEWS): పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తోడేరు గ్రామంలో రత్నగిరి చెరువులో షికారుకెళ్లిన యువకులు గల్లంతయినారు. ఆదివారం పడవలో వెళ్లిన ఆరుగురు చెరువులో మునిగిపోయారు. పది మంది గజ ఈతగాళ్లు, సహాయక బృందాలు గల్లంతైన వారికోసం చెరువులో గాలించారు. ఆరుగురు యువకుల మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది. మరణించిన వారు మున్నూరు కల్యాణ్, అల్లీ శ్రీనాథ్, బట్టా రఘు, చల్లా ప్రశాంత్, చల్లా బాలాజి గా పోలీసులు గుర్తించారు. సోమవారం సాయంత్రానికి సురేంద్ర మృతదేహం దొరికింది. తన మనవడు ప్రశాంత్ చెరువులో గల్లంతాయ్యాడన్న విషయం తెలియడంతో ప్రశాంత్ అమ్మమ్మ బైనా రమణమ్మ ఒత్తిడికి గురై మృతి చెందినట్లు సమాచారం.