ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి!

గన్నవరం (CLiC2NEWS): ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పులలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. కోబ్రా, బస్తర్, ఫైటర్స్, డీఆర్జీ బలగాలు సంయుక్తంగా కూబింగ్ చేపట్టాయి. రాష్ట్రంలోని సుక్మా జిల్లా చింతల్‌నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం-కొత్తపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం భద్రతా బలగాలకు మావోయిస్టు దళాలకు మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.
ఈ నెల 22వ తేదీన మావోయిస్టులు భారత్ బంద్‌కు పిలుపినిచ్చారు. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు జరిగిన ఎదురు కాల్పుల అనంతరం ఆంధ్రప్రదేశ్ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు అలజడి సృష్టించారు. జగదల్‌పూర్ నుండి విజయవాడ వస్తున్న గన్నవరం డిపో బస్సులోని ప్రయాణికులందరిని దింపేశారు. బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరు స్థానిక సిఆర్‌పిఎఫ్ క్యాంపు కార్యాలయంలో తలదాచుకున్నారు. డ్రైవర్ దగ్గర నుండి ఫోన్ లాక్కుని బస్సుకు నిప్పుపెట్టినట్లు పోలీసులుల తెలిపారు. ప్రయాణికులందరిని విజయవాడకు సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు గన్నవరం డిపో మేనేజర్ తెలిపారు. తెలిపారు.