ఈదురు గాలులకు కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి

సిమ్లా (CLiC2NEWS): బలమైన ఈదురు గాలులు కారణంగా చెట్లు, కొండచరియలు విరిగిపడి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని కులు సమీపంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పర్యాటక ప్రాంతంలో బలమైన గాలులు వీచాయా. దీంతో చెట్టు విరిగి వాహనాలపై పడటంతో ఆరుగురు మృతి చెందారు. మరికొందరికి గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. వీరంతా పర్యాటకులుగా పోలీసులు గుర్తించారు.