ఆరు రాష్ట్రాల‌కు అద‌న‌పు రుణాలు పొందే అవ‌కాశం: నిర్మ‌లాసీతారామ‌న్‌

ఢిల్లీ (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌హా ఆరు రాష్ట్రాల‌కు అద‌నంగా రుణాన్ని పొందే అవ‌కాశం క‌ల్పించింది కేంద్ర ప్ర‌భుత్వం. విద్యుత్ సంస్క‌ర‌ణల్లో ప్ర‌ధానంగా 3 అంశాల‌ను అమ‌ల్లోకి తీసుకు వ‌చ్చింనందుకు గాను ఈ అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు స‌మాచారం. 2021-22 ఆర్ధిక సంవ‌త్స‌రంలో 12 రాష్ట్రాలు ఈ అవ‌కాశాన్ని ద‌క్కించుకున్నాయి. తాజాగా ఆరు రాష్ట్రాలు ఈ అవ‌కాశం ద‌క్కించుకున్న‌ట్లు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. 15వ ఆర్ధిక సంఘం సిఫార‌సుల మేర‌కు మార్కెట్ నుండి అద‌న‌పు రుణాలు పొందేందుకు అనుమ‌తిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ రాష్ట్రాలు విద్యుత్ రంగంలో సంస్క‌ర‌ణ‌లు అమ‌లు చేసినందుకు గాను అద‌నంగా 0.5 శాతం రుణాలు పొందే అవ‌కాశం క‌ల్పించింది.

Leave A Reply

Your email address will not be published.