పంజాబ్‌లో స్వల్ప భూకంపం
భటిండా (CLiC2NEWS): పంజాబ్‌లోని భటిండా సమీపంలో శుక్రవారం ఉదయం 8.24 గంటల సమయంలో భటిండాలో 4.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. భటిండాకు పశ్చిమాన 231 కి.మీ దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు పేర్కొంది. ఉదయం 8:24 గంటలకు ఉపరితలం నుంచి 92 కి.మీ లోతులో భూకంపం సంభవించినట్లు తెలిపంది. ఈ భూకంపం వల్ల సంభవించిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.