స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే!
హైదరాబాద్ (CLiC2NEWS): బంగారం కొనాలనుకొనే వారికి శుభవార్త. స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు రూ. 60 తగ్గి రూ. 51.320గా ఉంది. బంగారం బాటలోనే వెండి కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ. 139 తగ్గి రూ. 67,553గా ఉంది. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులు కారణగా దేశంలో కూడా బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తోంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెల్ర్స్ అసోసియేషన్ (ఐబిజెఎ) ప్రకారం.. దేశంలో స్వచ్ఛమైన బంగారం ధర రూ. 400కు పైగా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ. 51,315 గా ఉంది. 22 కారెట్ల బంగారం ధర రూ. 47,409 నుంచి 47,005 తగ్గింది.
ఇక హైదరాబాద్ లో స్వచ్ఛమైన బంగారం రూ. 51,670 గా ఉంది. ఆభరణాల తయారీ బంగారం ధర రూ. 47,350 గా ఉంది. బంగారంతో పాటు వెండి కూడా తగ్గింది. కిలో వెండి రూ. 67,004 కి చేరింది.