దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 38,667 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు శ‌నివారం కేంద్ర ఆరోగ్య‌మంత్రిత్వ‌శాఖ క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

  • తాజా కేసుల‌తో క‌లిపి దేశంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన‌ మొత్తం కేసుల సంఖ్య 3,21,56,493కు చేరింది.
  • గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో 35,743 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 3,13,38,088 మంది బాధితులు కోలుకున్నారు.
  • 3,87,673 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
  • గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశంలో 478 మంది మరణించారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం క‌రోనాతో 4,30,732 మృతిచెందారు.
  • ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 53.61 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.
Leave A Reply

Your email address will not be published.