స్మార్ట్ సిటి మిషన్ గడువు వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగింపు..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో వరంగల్ కరీంనగర్ నగరాల్లో స్మార్ట్ మిషన్ పనులు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒప్పందం ప్రకారం .. స్మార్ట్ సిటి మిషన్ కాల పారిమితి జూన్ నెలాఖరుతో ముగియనుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్వవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కలిసి స్మార్ట్ సిటి మిషన్ కాల పరిమితిని వచ్చే ఏడాడి జూన్ వరకు పొడిగించాలని కోరారు. దీంతో కేంద్ర సానుకూలంగా స్పందించి.. వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించేందుకు అంగీకరించింది.
వరంగల్‌లో ఇప్పటి వరకు 45% పనులు.. కరీంనగర్లో 25 శాతం పనులు పూర్తయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పనులు పూర్తయ్యే వరకు మిషన్ గడువు పొడిగించాలని సిఎం కేంద్రాన్ని కోరారు. ఇప్పటికే నిధులు కేటాయించి ఆమోదించిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని .. కొత్తవి ఉండవని తెలిపింది. అయితే జరుగుతున్న పనులకు నిధులను ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో విడుదల చేయనున్నట్లు సమాచారం.