తరగతి గదుల్లో స్మార్డ్ టివిలు, ప్రొజెక్టర్లు.. సిఎం జగన్

అమరావతి (CLiC2NEWS): ప్రతి తరగతి గదిలోనూ డిజిటల్ బోధన చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. శుక్రవారం ఆయన విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ప్రీ ప్రైమరీ-1 నుండి రెండో తరగతి వరకు స్మార్ట్ టివిలు ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. 3వ తరగతి నుండి పైతరగతులకు ప్రొజెక్టర్లు పెట్టేలా ఆలోచన చేయాలన్నారు. నాడు-నేడు పూర్తి చేసుకున్న అన్ని స్కూళ్లలో మొదటి దశ కింద ఏర్పాటు చేయాలని.. వచ్చే వారం రోజులలో దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని సిఎం ఆదేశించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సిఎస్ సమీర్ శర్మ, పాఠశాల విద్యాశాఖ, ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.