ఈ నెల 25న గగనతలంలో స్మైలీ ఫేస్..!

Smiley face : ఈ నెల 25న గగనతలంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానున్నట్లు సమాచారం. సౌరకుటుంబంలో రెండు గ్రహాలు , చంద్రుడు సమీపంలోకి రావడంతో అందమైన దృశ్యం కనువిందు చేయనుందని సైన్స్ వెబ్‌సైట్ లైవ్ సైన్స్ వెల్లడించింది. శుక్రుడు, శని, నెలవంక (చంద్రుడు) అతి సమీపంలోకి రానున్నాయి. దీంతో ఆ మూడు కలిపి స్మైలీ ఫేస్ ఆకృతిని ప్రతిబింబించనున్నాయి. 25వ తేదీ సూర్యోదయానికి ముందు ఈ దృశ్యం కనిపించనుంది. ప్రపంచంలో ఎక్కడనుండైనా ఈ సుందర దృశ్యాన్ని వీక్షించే అవకాశం ఉంది. రెండు గ్రహాలు నయనాలుగా.. నెలవంక చిరునవ్వుతో ఉన్న పెదాలుగా .. స్మైలీ ఫేస్ కనిపిస్తుంది. ఈ వివరాలను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సోలీర్ సిస్టమ్ అంబాసిడర్ బ్రెండా కల్బర్టన్ వెల్లడించారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు స్టార్ గేజింగ్ బైనాక్యులర్, టెలిస్కోప్ అవసరం ఉంటాయి.