రంగారెడ్డి జిల్లాలో సాప్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య!

హైదరాబాద్ (CLiC2NEWS): ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్ తన ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి ఎపిలోని తూర్పుగోదావరి జిల్లా వేములపల్లికి చెందినట్లు గుర్తించారు. అతను టిసిఎస్‌లో సిస్టమ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్ల సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.