మా సమస్యలు పరిష్కరించండి..

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని ఖైరతాబాద్‌లోని విద్యుత్ సౌదా వద్ద విద్యుత్ ఉద్యోగులు మహాధర్నా చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ.. వివిధ జిల్లాల నుండి ఉద్యోగులంతా భారీగా తరలివచ్చారు. వేతన సవరణ, ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దీంతో ఖైరతాబాద్-పంజాగుట్ట రహదారిపై భారీగా వాహానాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనాదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ధర్నా చేస్తున్న ఉద్యోగులను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.