జ‌ల‌మండ‌లిలో ప‌లువురు ఉద్యోగుల‌కు ప‌దోన్న‌తులు..

హైద‌రాబాద్  (CLiC2NEWS): న‌గ‌రంలోని జలమండలి విభాగంలో ప‌లువురు ఉద్యోగుల‌కు ప‌దోన్న‌తి ల‌భించింది. బోర్డు ప‌రిధిలో వివిధ విభాగాల్లో ఇద్ద‌రు జనరల్ పర్పస్ ఎంప్లాయిస్ (జీపీఈ) ల‌కు స్పెష‌ల్ ప‌ర్ప‌స్ ఎంప్లాయిస్ గా.. న‌లుగురు జూనియ‌ర్ టెక్నికల్ ఆఫీసర్ (జేటీవో)ల‌కు అసిస్టెంట్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్లు (ఏటీవో) గా ప్ర‌మోష‌న్ క‌ల్పించారు.

ఖైరతాబాద్ లోని జ‌ల‌మండ‌లి ప్రధాన కార్యాలయంలో శుక్ర‌వారం సీజీఎం (పీ అండ్ ఏ) మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ అధ్యక్షుడు రాంబాబు యాదవ్, క‌నీస వేత‌నాల స‌ల‌హా మండ‌లి ఛైర్మ‌న్ పి. నారాయ‌ణ వారికి నియామక పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప‌దోన్న‌తులు పొందిన‌వారు ఈ సంద‌ర్భంగా ఎండి దానం కిశోర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌ సరస్వతి, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్లు లక్ష్మీ నారాయ‌ణ‌, అక్త‌ర్‌, జనరల్ సెక్రటరీ జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.

సం/-

Leave A Reply

Your email address will not be published.