నవమి వేడుకల్లో విషాదం..

ఇండోర్ (CLiC2NEWS): పండుగ వేళ విషాదం చోటుచేసుకుంది. ఓ ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తుండగా.. ఆలయంలోని మెట్ల బావిపైకప్పుకూలి భక్తులు పడిపోయారు. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. పటేల్‌నగర్ ప్రాంతంలోని మహదేవ్ జులేలాల్ ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలోని మెట్ల బావిపై ఉన్న ఫ్లోరింగ్ కూలి.. దాదాపు 30 మందికి పైగా భక్తులు బావిలో పడిపోయారు. సహాయక చర్యలు చేపట్టి 17 మందిని కాపాడారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
ఇండోర్ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఫోన్‌చేసి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.