ఇస్రో కొత్త చీఫ్‌గా సోమనాథ్ నియామకం..

ఢిల్లి (CLiC2NEWS): భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) నూతన చీఫ్‌గా ఎస్ సోమనాథ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న చీఫ్ కె శివన్ పదవీకాలం ముగియనుంది. ఆయన స్థానంలో కేంద్రప్రభుత్వం డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ కార్యదర్శి, స్పేస్ కమిషన్ ఛైర్మన్‌గా సోమనాథ్‌ను నియమించింది. ఈయన 2018జనవరి నుండి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. భారీ ఉప గ్రహాల ప్రయోగాలకు వినియోగించే GSLV MK-111 లాంచర్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. 2010 వ సంవత్సరం నుండి 2014 వరకు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు.