భారతీయుడు 2.. సిద్ధార్థ్, రకుల్ మెలోడి సాంగ్..

హైదరాబాద్ (CLiC2NEWS): కమల్‌హాసన్ భారతీయుడు 2 చిత్రం నుండి మెలోడి లిరికల్ సాంగ్ విడుదలైంది. కాజల్ అగర్వాల్, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం సిద్ధార్థ్, రకుల్ మధ్య చిత్రించిన మెలోడి సాంగ్ రిలీజ్ చేసింది.